Share News

బెంగాల్‌కు తరలించబోతూ...

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:45 PM

స్థానిక రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌పారం-2లో మంగళవారం ఓ మహిళ నుంచి మొత్తం ఏడు ప్యాకెట్లలో 11 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగాల్‌కు తరలించబోతూ...
నిందితురాలితో రైల్వే పోలీసులు

పలాస, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌పారం-2లో మంగళవారం ఓ మహిళ నుంచి మొత్తం ఏడు ప్యాకెట్లలో 11 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలివీ...పశ్చిమ బెంగాల్‌కు చెందిన నుబహార్‌బీబీషేక్‌ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసుకొని బెంగాల్‌ రాష్ట్రానికి తరలించేందుకు స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఫ్లాట్‌పారంపై ఆమె అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో రైల్వే, ఆర్పీఎఫ్‌ పోలీసులు ప్రశ్నించడంతో పాటు బ్యాగును తనిఖీ చేశారు. దీంతో గంజాయి బయట పడింది. దీన్ని తూకం వేసి కేసు నమోదు చేశారు. విశాఖపట్నం రైల్వే కోర్టులో ఆమెను హాజరుపరుస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులు నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వంటి చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:45 PM