దామోదరపురానికి దారేది?
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:39 PM
మండలంలోని దామోదరపురం గ్రామానికి సరైన రహదారి లేక గ్రామస్థులు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సోంపేట రూరల్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దామోదరపురం గ్రామానికి సరైన రహదారి లేక గ్రామస్థులు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతులు, బురదతో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లోను గ్రామం నుంచి బయటకు వెళ్లడం కష్టంగా మారింది. రోడ్డు దుస్థితి కారణంగా పిల్లలు విద్యా సంస్థలకు వెళ్లడం మానుకున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రహదారిపై ప్రయాణిస్తున్న గర్భిణికి అత్యవసర పరిస్థితి తలెత్తి, కడుపులోనే శిశువు మృతి చెందిందన్నారు. పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా స్పందన లేదని, తక్షణమే రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు గేదెల శ్యామల, సావిత్రి, మోహినమ్మ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.