Share News

25 ఏళ్లలో అరసవల్లి పుణ్యక్షేత్రం అభివృద్ధి ఏదీ?

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:06 AM

సుదీర్ఘకాలం పాలన సాగించిన నాయ కులు శ్రీకాకుళం నగరానికి ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయం ప్రత్యర్థి అభ్యర్థి నివాసానికి పక్కనే ఉన్నప్పటికీ 25 ఏళ్లలో ఆలయాన్ని అభివృద్ధి చేయలేకపోయారని.. వారు ఇప్పుడు శ్రీకాకుళం నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీలివ్వడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

25 ఏళ్లలో అరసవల్లి పుణ్యక్షేత్రం అభివృద్ధి ఏదీ?
ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రులు కింజరాపు రామ్మోహన్‌, అచ్చెన్నాయుడు, చిత్రంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, మేయర్‌ అభ్యర్థి దానేటి రాధారాణి

గొడ్డలి పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు

రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కేంద్రమంత్రి రామ్మోహన్‌, ఎమ్మెల్యే శంకర్‌, మేయర్‌ అభ్యర్థి రాధారాణితో కలిసి ర్యాలీ

శ్రీకాకుళం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలం పాలన సాగించిన నాయ కులు శ్రీకాకుళం నగరానికి ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయం ప్రత్యర్థి అభ్యర్థి నివాసానికి పక్కనే ఉన్నప్పటికీ 25 ఏళ్లలో ఆలయాన్ని అభివృద్ధి చేయలేకపోయారని.. వారు ఇప్పుడు శ్రీకాకుళం నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీలివ్వడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అరసవల్లిని అభివృద్ధి చేయలేని గొడ్డలి పార్టీ నేతలకు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. శ్రీకాకు ళం కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఆయన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, మేయర్‌ అభ్యర్థి దానేటి రాధారాణి, కార్పొరేటర్‌ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. 40 సంవత్స రాల పాటు పాలన చేసిన వారు నగరానికి ఏం చేశారో పరిశీలించాలన్నారు. దాదాపు 16 ఏళ్లు గా మునిసిపాలిటీకి, అనంతరం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడంతో స్థానిక నాయకత్వం లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. నగరం అభివృద్ధి లో వెనుకబడిందని, స్థానికంగా నివసిస్తున్న ప్రజలే ఇందుకు ప్రత్యక్ష సాక్షులని అన్నారు.

24 గంటలు తాగునీరు.. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ

రానున్న రెండున్నరేళ్లలో శ్రీకాకుళం నగర రూపురేఖలు మార్చే బాధ్యతను తాము తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మరో ఏడాదిలో ప్రతి ఇంటికీ 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం పడితే పట్టణమంతా సము ద్రాన్ని తలపించే పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యను సవాల్‌గా తీసుకు న్నామని, రానున్న రెండున్నరేళ్లలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీ కరిస్తామని చెప్పారు. శ్రీకా కుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగరంలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని వెల్లడించారు. మేయర్‌గా దానేటి రాధారాణి, కూటమి కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.

2024 తర్వాత నగర అభివృద్ధికి ప్రాధాన్యం..

2024 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌, ఎన్డీఏ కూటమి ఆశీస్సులతో సామాన్య కార్యకర్తగా పోటీ చేసిన గొండు శంకర్‌ 55 వేల మెజార్టీతో విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. 2024కు ముందు శ్రీకాకుళం పట్టణం ఎలా ఉండేది.. 2024 తర్వాత గొండు శంకర్‌ ఎమ్మెల్యేగా, కింజరాపు రామ్మోహన్‌ నాయు డు కేంద్ర మంత్రిగా, తాను రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు న్నరేళ్లలో నగర అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టామో ప్రజలు గమనించాలన్నా రు. ప్రజలు ఎన్నుకున్న ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లే నేరుగా ప్రజల వద్దకు వచ్చి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్ని విధాలా సహాయపడేలా బాధ్యత తీసుకుం టారని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో మాయమాటలు, ప్రలో భాలు, వివిధ కార్యక్రమాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలను నమ్మవద్దని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా వైసీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీ యంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పెద్దపాడు నుంచి బలగ కూడలి వరకు భారీ ర్యాలీ

కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రులు పెద్దపాడు నుంచి బలగ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పెద్దపాడు కూడలి, రామలక్ష్మణ, సూర్యమహల్‌, అరసవల్లి కూడలి, అరసవల్లి మీదుగా కాజీపేట, కలెక్టర్‌ కార్యాలయం రహదారి, సంతోషిమాత గుడి మీదుగా పాత బస్టాండ్‌, పాలకొండ రోడ్డు, డేఅండ్‌నైట్‌ కూడలి మీదుగా బలగ కూడలి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మంత్రులు విక్టరీ చూపెడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి నగర అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ర్యాలీలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:06 AM