Share News

విద్యార్థులకు యూనిఫాం ఎప్పుడిస్తారు?

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:31 PM

విద్యార్థులకు యూనిఫాంలు ఇంకెప్పు డు పంపిణీ చేస్తారని సైనూరు ఎంపీటీసీ సభ్యుడు గుంటు మాకయ్య అధికారులను ప్రశ్నించారు.

విద్యార్థులకు యూనిఫాం ఎప్పుడిస్తారు?
మాట్లాడుతున్న ఎంపీపీ నీలవేణి

- రోడ్డు పనుల్లో నాణ్యత లోపించింది

- మండల సమావేశంలో సభ్యులు

వజ్రపుకొత్తూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): పాఠశా లలు పునఃప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫాంలు అందించలేదని, ఇంకెప్పు డు వాటిని పంపిణీ చేస్తారని సైనూరు ఎంపీటీసీ సభ్యుడు గుంటు మాకయ్య అధికారులను ప్రశ్నించా రు. ఎంపీపీ ఉప్పరపల్లి నీలవేణి అధ్యక్షతన సోమవా రం మండల సర్వసభ్యసమావేశం సాదా సీదాగా జరి గింది. విద్యార్థులకు త్వరలో యూనిఫాం అందిస్తామని ఎంఈవో వెంకటరమణ తెలిపారు. ఇటీవల నిర్మించిన అక్కుపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు గరుడుభద్ర, డోకులపాడు గ్రామాల వద్ద నాణ్యత లోపించిందని మండల ప్రత్యేక ఆహ్వానితుడు ఉప్పరపల్లి ఉదయకుమార్‌ అన్నారు. రెండో విడత రోడ్డు పనుల్లో వాటిని సరిచేస్తామని జేఈఈ జగదీష్‌ చెప్పారు. గోవిందపురం పీహెచ్‌పీకి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో సిబ్బం దితో పాటు రోగులు ఇబ్బందులు పడుతున్నారని వైస్‌ ఎంపీపీ రాజు పేర్కొన్నారు. పల్లిసారధిలో విద్యుత్‌ లైట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఎంపీపీ నీలవేణి విద్యుత్‌ ఏఈ వెంకటరమణ దృష్టికి తీసుకురాగా.. వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈసమావేశంలో ఎంపీడీవో రమేష్‌ నాయుడు, మండల ఇంజనీర్‌ నాగభూషణ్‌, వైద్యాధికా రులు రిచర్డ్‌బూన్‌, వినయ్‌కుమార్‌, ఈవోఆర్డీ తిరుమల రావు వైస్‌ ఎంపీపీ తమ్మినేని శ్రావణి పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 11:31 PM