Share News

ఫిర్యాదుల బాక్సు తెరిచేదెప్పుడో?

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:17 AM

జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరుపై తరచూ విమర్శ లు వస్తుండడంతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరు నెలలు కింద ట ఆసుపత్రిలో ఫిర్యాదు బాక్సును ఏర్పాటు చేయించారు.

ఫిర్యాదుల బాక్సు తెరిచేదెప్పుడో?
టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో గల ఫిర్యాదుల బాక్సు

  • వైద్యులు, సిబ్బంది పనితీరుపై విమర్శలు

  • మంత్రి అచ్చెన్న ఆదేశంతో జిల్లా కేంద్రాసుపత్రిలో ఏర్పాటు

  • ఒక్కసారి కూడా తెరిచి చూడని వైనం

టెక్కలి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరుపై తరచూ విమర్శ లు వస్తుండడంతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరు నెలలు కింద ట ఆసుపత్రిలో ఫిర్యాదు బాక్సును ఏర్పాటు చేయించారు. అయితే ఈ బాక్సును ఇప్పటివరకు తెరవలేదు. ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలనకు గైర్హాజరవడం, పూర్తిస్థాయి వైద్యసేవలు రోగులకు అందించకపోవడంపై కొన్నాళ్లుగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో రోగులకు తాగునీటి సమస్య, కంపుకొడుతున్న మరుగుదొడ్లు దుస్థితి, తిరగని ఫ్యా న్లు, మరమ్మతులకు గురైన వీల్‌చైర్లు, మందులు కొరత, సమయపాలన కరువైన కొందరు వైద్యులు, రోగులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవ డడం ఇలా అనేక సమస్యలు రోగులను వెంటాడుతూనే ఉన్నాయి. ఆసుపత్రిలో ఏదైనా లోపం కనిపిస్తే ఈ ఫిర్యాదుబాక్సులో చీటీ రాసి వేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెళ్లడించినప్పటికీ.. వైద్యులు, వైద్య సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. రోగులకు సంబంధించి కొన్నిరకాల మందులు ఆసు పత్రిలో లభ్యం కాక బయట కొనుగోలు చేయాలని రాసివ్వడం పరిపాటిగా మా రింది. ఫిర్యాదుబాక్సు తెరిస్తే అందులో ఎన్ని చీటీలు పడ్డాయి? ఎవరెవరిపై ఫిర్యా దులు వచ్చాయి? ఏఏ సమస్యలు ఉన్నాయో వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Mar 29 , 2026 | 12:17 AM