Share News

జనాభా తగ్గిందేంటి?

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:02 AM

Differences in 106 villages in the 'census' జనగణన ప్రక్రియలో వ్యత్యాసంపై అధికారులు అయోమ యం చెందుతున్నారు. ప్రభుత్వం ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు స్వీయగణన చేపట్టింది. గత నెల 1 నుంచి 31 వరకు ఇంటింటికీ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరించి.. జన గణన నమోదు చేశారు. 2011 తర్వాత చేపడుతున్న జనగణన ప్రక్రియ కావ డంతో.. ఈ 15 ఏళ్లలో జనాభా పెరుగు తుందని భావించగా.. అందుకు భిన్నం గా కొన్ని గ్రామాల్లో తక్కువగా నమో దు కావడం గమనార్హం.

జనాభా తగ్గిందేంటి?
గొప్పిలిలో సర్వే పరిశీలిస్తున్న ఎంపీడీవో ప్రసాద్‌పండా (ఫైల్‌)

  • ‘జనగణన’లో 106 గ్రామాల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తింపు

  • మరోసారి క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన

  • మెళియాపుట్టి మండలం డబారు గ్రామంలో 2011లో 1,180 మంది జనాభా ఉన్నట్టు అధికారులు లెక్క చూపారు. ప్రస్తుతం చేపడుతున్న జనగణనలో 309 మంది ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఇదే మండలం పరశురాంపురంలో 2011లో 1,573 జనాభా ఉండేవారు. ప్రస్తుత జనగణనలో 1,231 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా.. 15 ఏళ్ల వ్యవధిలో జనాభా పెరగాల్సి ఉండగా.. తక్కువగా ఉండడంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

  • మెళియాపుట్టి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి):

  • జనగణన ప్రక్రియలో వ్యత్యాసంపై అధికారులు అయోమ యం చెందుతున్నారు. ప్రభుత్వం ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు స్వీయగణన చేపట్టింది. గత నెల 1 నుంచి 31 వరకు ఇంటింటికీ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరించి.. జన గణన నమోదు చేశారు. 2011 తర్వాత చేపడుతున్న జనగణన ప్రక్రియ కావ డంతో.. ఈ 15 ఏళ్లలో జనాభా పెరుగు తుందని భావించగా.. అందుకు భిన్నం గా కొన్ని గ్రామాల్లో తక్కువగా నమో దు కావడం గమనార్హం. జిల్లాలో 3,586 రెవెన్యూ గ్రామాల్లో 4073 మంది సిబ్బం ది, 685 మంది పరిశీలకులతో జనగణన ప్రక్రియ చేపట్టారు. కాగా 106 రెవెన్యూ గ్రామా ల్లో జనాభా లెక్కల్లో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆ గ్రామాలకు మండలస్థాయి అధికారులు మరోసారి వెళ్లి పరిశీలించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సోమవారం ఆదేశించారు. పది రోజుల్లో క్షుణ్ణంగా పరిశీలించి.. జనాభా తగ్గుదలకు కారణాలు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

  • ఎందుకు ఈ సమస్య:

  • జిల్లాలోని గత 15 ఏళ్లలో చాలా మంది ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. అధికంగా హైదరాబాద్‌, ఢిల్లీ, మద్రాస్‌, విశాఖ తదితర ప్రాంతాల్లో జిల్లావాసులు నివసిస్తున్నారు. మరికొంత మంది ఉద్యోగం, వ్యాపారాల రీత్యా పట్టణాల్లో స్థిరపడ్డారు. వృద్ధ తల్లిదండ్రులను సైతం తమవెంట తీసుకెళ్లిపోవడంతో.. చాలా గ్రామాల్లో జనాభా తగ్గుదల కనిపిస్తోంది. అలాగే చాలామంది వేసవి సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అధికారులు, సిబ్బంది వెళ్లే సమయానికి అందుబాటులో లేకపోవడంతో కొంతమంది పేర్లు జనగణనలో నమోదు కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు సమగ్రంగా పరిశీలించనున్నారు.

  • మళ్లీ పరిశీలిస్తున్నాం

  • మెళియాపుట్టి మండలానికి సంబంధించి 2011 జనాభా లెక్కలకు.. ప్రస్తుత సర్వేకు ఇళ్లతోపాటు మూడు రెవెన్యూ గ్రామాల్లో జనాభా తగ్గుదల కనిపించింది. మరోసారి సర్వే చేసి కారణాలు గుర్తిస్తున్నాం.

    - బి.పాపరావు, తహసీల్దార్‌, మెళియాపుట్టి

Updated Date - Jun 06 , 2026 | 12:02 AM