పనులపై అవగాహన లేకుంటే ఎలా?
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:15 AM
ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న పనులపై అవగాహన లేకుం టే ఎలా అంటూ.. ఉపాధి సి బ్బందిని, ఇరిగేషన్ అధికారు లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రశ్నించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
అధికారుల నిర్లక్ష్యంపై అసహనం
ఎల్‌ఎన్ పేట, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న పనులపై అవగాహన లేకుం టే ఎలా అంటూ.. ఉపాధి సి బ్బందిని, ఇరిగేషన్ అధికారు లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రశ్నించారు. సిద్దాం తం పెద్దకోనేరుకు నీరువచ్చే కాలువను శుక్రవారం ఆయన పరిశీలించారు. పెద్దకోనేరుకు ఎలానీరు వస్తుందని, నీరువచ్చే మార్గాలు ఏ విధంగా ఉన్నాయని ఏపీవో శ్రీదేవి, ఇరిగేషన్ ఏఈ, ఉపాధి పథకం ఈసీని ప్రశ్నించ గా.. సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో ఆగ్ర హం వ్యక్తం చేశారు. చెరువుకు నీరు వచ్చేందుకు అవసరమైన మార్గాలను రికార్డుల ప్రకారం గుర్తించి ఆక్రమణ లు జరిగితే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పట్టా దారు పాసుపుస్తకాల్లో ఎటువంటి తప్పులు లేకుండా రైతులకు అందించ టమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సిద్దాంతం రెవెన్యూ పరిధిలో రైతుల నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఎన్ని పరిష్కరిం చారు? అని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించగా.. సరైన సమాధానాలు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. జీతం ఎందుకు తీసుకుంటు న్నారంటూ రెవెన్యూ కార్యదర్శి పనితీరుపై మండిపడ్డారు. అరగంటలో పూర్తి సమాచారం ఇవ్వాలని సమయం ఇచ్చారు. ఆ తరువాత గ్రామానికి సంబంధించిన 405 ఖాతాల వివరాల స్థితిగతులను కార్యదర్శి కలెక్టర్‌కు వివరించారు. గ్రామకంఠాన్ని 22-ఏ నుంచి తొలగిస్తున్నట్టు కలెక్టర్ చెప్పడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్‌డీసీ ఎస్వీ లక్ష్మణరావు, తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ, ఎంపీడీవో పి.శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎస్.గోవిందరావు, ఏపీవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.