ఆ యువకుడికి ఏమైంది?
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:44 PM
స్థానిక పచోరి కాలనీలో ఉంటున్న గరికి అనిల్ కుమార్ (34) అనుమానాస్పద రీతిలో మంగళవారం మృతిచెందాడు. స్థానిక ఎస్‌ఐ గణేష్, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ
నరసన్నపేట, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక పచోరి కాలనీలో ఉంటున్న గరికి అనిల్ కుమార్ (34) అనుమానాస్పద రీతిలో మంగళవారం మృతిచెందాడు. స్థానిక ఎస్‌ఐ గణేష్, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి చెందిన అనిల్‌కుమార్‌కు నరసన్నపేట పచోరి కాలనీకి చెందిన పార్వతితో వివాహమైంది. అప్పటి నుంచి అనిల్ కుమార్ పచోరి కాలనీలో భార్యతో ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం నిద్రకు ఉపక్రమించిన మృతుడు అనిల్ కుమార్ మంగళవారం తెల్లవారు జాము వరకు లేవకపోవడంతో భార్య పార్వతి సమీపంలో గల ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం అనిల్ కుమార్ తల్లికి అతని భార్య సమాచారం ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట చేరుకున్న అనిల్ కుమార్ తల్లి లక్ష్మి, బంధువులు అతని మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి... మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేష్ తెలిపారు.