Share News

ఏమి తిన్నారు.. ఎలా ఉన్నారు: పీవో

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:54 PM

‘ఏమి తిన్నారు.. ఎలా ఉన్నారు’ అని ఆశ్రమపాఠశాల విద్యార్థులను సీతంపేట ఐటీడీఏ పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నథ్‌ అడిగి తెలుసుకున్నారు.

  ఏమి తిన్నారు.. ఎలా ఉన్నారు: పీవో
విద్యార్థులతో మాట్లాడుతున్న పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నథ్‌

మెళియాపుట్టి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘ఏమి తిన్నారు.. ఎలా ఉన్నారు’ అని ఆశ్రమపాఠశాల విద్యార్థులను సీతంపేట ఐటీడీఏ పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నథ్‌ అడిగి తెలుసుకున్నారు. బుధవారం సాయంత్రం భరణికోట ఆశ్రమపాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేసి, విద్యార్థులను మెనుఅమలుతీరును అడిగితెలుసుకున్నారు. సకాలంలో సిలబస్‌ పూర్తి చేయాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని కోరారు. పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం రికార్డులతో పాటు స్టాక్‌ రూమును పరిశీలించారు.

Updated Date - Feb 04 , 2026 | 11:55 PM