18 ఏళ్లు మంత్రిగా ఉండి జిల్లాకు ఏం చేశారు?
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:38 AM
ఉత్తరాంధ్ర జిల్లాలకు మణిహారంగా భోగా పురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని మోదీ ప్రారంభిస్తుంటే మాజీ మం త్రి ధర్మాన ప్రసాదరావు ఈర్ష్య, ద్వేషాలతో రగిలి పోతూ అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గొండు శంకర్ అన్నారు.
ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతున్న ధర్మాన
ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గొండు శంకర్
శ్రీకాకుళం అర్బన్/అరసవల్లి, జూలై 29 (ఆంధ్ర జ్యోతి): ఉత్తరాంధ్ర జిల్లాలకు మణిహారంగా భోగా పురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని మోదీ ప్రారంభిస్తుంటే మాజీ మం త్రి ధర్మాన ప్రసాదరావు ఈర్ష్య, ద్వేషాలతో రగిలి పోతూ అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గొండు శంకర్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. 18 ఏళ్లు మంత్రిగా వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు జిల్లాకు ఏం చేశారో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ.. రాజకీయ అస్తిత్వాన్ని, ఉనికిని కాపా డుకునేం దుకు ధర్మాన ప్రవచనకర్తగా మారాడని, ఆయన సూక్తులు వినే స్థితిలో జిల్లా ప్రజలు లేరన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూసేకరణ తానే చేశానడడం హాస్యాస్పదంగా ఉంద న్నారు. 2015- 2019 మధ్య టీడీపీ హయాంలో ఎయిర్‌పోర్టు పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. 2019లో జగన్ అధి కారంలోకి వచ్చిన తరువాత జీఎంఆర్ సంస్థతో బేరసారాలు చేసి 2,500 ఎకరాలు కేటాయింపులో ఉన్న భూమిని రెండు వేల ఎకరాలకు కుదించి 500 ఎకరాలను జగన్, ధర్మాన కాజేయాలని చూశారని ఆరోపించారు. జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు నిర్మాణ పనులు టీడీపీ హయాంలోనే 90 శాతం పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం కూడా పూర్తి చేయని ప్రసాదరావు, కృష్ణదాస్‌లు జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆఫ్‌షోర్ నిర్మాణం కోసం ఆనాడే రూ.534 కోట్లు కేటాయించి భూసేకరణ పూర్తి చేసి ఇస్తే.. 27 శాతం పూర్తి చేసి ఒక్క రూపాయి కూడా వైసీపీ హయాంలో ఖర్చు పెట్టలేదన్నారు. వంశధార నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని ధర్మాన.. జగన్‌ను తీసుకొని వెళ్లి చెప్పి ఎకరాకు రూ.లక్ష మాత్రమే 2019లో ఇచ్చారన్నారు. నాడు బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన జగన్ బాటలోనే మరో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పయనిస్తు న్నారని.. అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒక ప్రా ణం పోయేలా చేస్తే బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా సీదిరి అప్పలరాజు ఇంటికి వెళ్లి ధర్మాన పరామర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు కూడా కనీసం మృతుడి కుటుంబాన్ని ఆదుకోకపోవడం దారు ణ మన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ధర్మానకు కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
బుర్రకథలో మధ్య పాటగాడిలా ధర్మాన..
ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. బుర్రకథలో మధ్య పాటగాడిలా ధర్మాన ప్రసాదరావు అవతారం ఎత్తారని, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన సంక్షేమానికి డబ్బులు ఇస్తు న్నాం కదా, అభివృద్ధి ఎక్కడ నుంచి చేయాలని ప్రజలతోనే వాగ్వాదానికి దిగిన సందర్భాలున్నాయన్నా రు. వైసీపీ హయాంలో శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వరకు ఉన్న సుమారు పది కిలోమీటర్లు రోడ్డే వేయలేదన్నారు. చంద్ర బాబు నాయుడును విమర్శిస్తే సహించేది లేదన్నారు. సమా వేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, నేతలు కలగ జగదీష్, పీరుకట్ల విఠల్, పినకాన అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.