Share News

తమ్మినేని భూబాగోతంపై ఏం సమాధానం చెబుతారు?

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:06 AM

ఉన్నత రాజ్యాంగ పదవిలో పనిచేసిన మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భూబాగోతానికి పాల్పడడంపై వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ఎమ్మెల్యే గొండు శంకర్‌ ప్రశ్నించారు.

తమ్మినేని భూబాగోతంపై ఏం సమాధానం చెబుతారు?
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఉన్నత రాజ్యాంగ పదవిలో పనిచేసిన మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భూబాగోతానికి పాల్పడడంపై వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ఎమ్మెల్యే గొండు శంకర్‌ ప్రశ్నించారు. నగరంలోని విశాఖ-ఎ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. బతికున్నవారిని చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూ ఆక్రమణకు పాల్పడడం దారుణమన్నారు. అక్రమ ఆస్తులు కూడబెట్టడమే ధ్యేయంగా జిల్లాలోని వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో వారు చేసిన మరిన్ని అవినీతి వ్యవహారాలు బయటకు వస్తాయని, సీనియర్‌ నాయకులుగా ఉంటూ చేసిన అక్రమాలకు చరమగీతం పడనుంద న్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి అడ్డూ అదుపు లేకుండా సాక్షాత్తూ చంద్ర బాబు నాయుడిపైనే నోటి కొచ్చినట్లు మాట్లాడా రని, ఇప్పుడు తమ్మినేనికి, మాజీ మంత్రి అప్పల రాజుకు శిక్ష అనుభవించే సమయం వచ్చింద న్నారు. మాజీమంత్రి అయిన అప్పలరాజు తన కుమారుడు బైక్‌తో యాక్సి డెంట్‌ చేసినప్పుడు బాధితుడిని వదిలేసి కుమారుడ్ని కేసులో నుంచి తప్పించేందుకు, మరో అమాయకుని బలిచేసి కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌, రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేష్‌, నేతలు పీఎంజే బాబు, ఉంగటి వెంకట రమణ, చిట్టి నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:06 AM