మేతకు వెళ్లి.. యూరియా తిని
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:38 AM
మేతకు వెళ్లిన గొర్రెలు, మేకలు అక్కడ చెట్ల కింద వేసిన యూరియాను తినడంతో మృతి చెందాయి.
- 35 గొర్రెలు, మేకలు మృతి
- విలపిస్తున్న కుటుంబ సభ్యులు
హిరమండలం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): మేతకు వెళ్లిన గొర్రెలు, మేకలు అక్కడ చెట్ల కింద వేసిన యూరియాను తినడంతో మృతి చెందాయి. మండలంలోని భీమవరం కొండ సమీపంలోని పంట పొలాల్లో 35కు పైగా గొర్రెలు, మేకలు మృతిచెంది పడిఉన్నాయి. కొరసవాడ గ్రామానికి చెందిన బతక లక్ష్మీరాయణ గత యాభై రోజలుగా ఈ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి బసచేసి గొర్రెలు, మేకల మందను మేపుతున్నాడు. సమీపంలోని సర్వే తోటలో మొక్కలు ఏపుగా పెరిగేందుకు వాటి మొదలు భాగంలో ఇటీవల రైతులు యూరియా వేశారు. ఆదివారం ఆ తోటలోకి మేతకు వెళ్లిన గొర్రెలు, మేకలు యూరియా తిన్నాయని లక్ష్మీనారాయణ చెబుతున్నాడు. యూరియా తిన్న గొర్రెలు, మేకలు సమీపంలో పంట పొలాల్లోకి వెళ్లి పలుచోట్ల మృతి చెంది పడి ఉన్నాయి. తనకు మొత్తం 350 గొర్రెలు, మేకలు ఉన్నాయని, వీటిలో ఎన్ని మృతి చెందాయో తెలియడం లేదని లక్ష్మీనారాయణ చెప్పాడు. పొలాల్లో వెతకగా 35 మృతి చెందినవి దొరికాయని, వీటి విలువ సుమారు రూ.6లక్షలు ఉంటుంది తెలిపాడు. తీవ్రంగా నష్టపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.