సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:48 PM
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు.
బూర్జ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కె.దీప అధ్యక్షతన మండల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూర్జ పీఏసీఎస్ ప్రతి రైతు దగ్గర డాక్యుమెంట్ పేరుతో సర్వీస్ చార్జీల కింద వెయ్యి రూపాయలు సొసైటీ సిబ్బంది పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఏ రైతు కూడా మూడు లక్షల రూపాయలు వరకు రైతులు రుణాలు తీసుకున్నప్పుడు ఇటువంటి సాధ్యులు తీసుకొని అవసరం లేదని తెలిపారు. ఎవరైనా సిబ్బంది రైతులు దగ్గర డబ్బులు కలెక్షన్ చేస్తే నేనే నేరుగా ఏసీబీలకు అప్పగిస్తానని హెచ్చరించారు. మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్య క్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మార్కెఫెడ్ డైరెక్టర్ రామకృష్ణనాయుడు, వైస్ ఎంపీపీ సూర్యారావు, కృష్ణమూర్తి, ఎంపీడీవో తిరుపతిరావు, జడ్పీటీసీ రామారావు పాల్గొన్నారు.