Share News

గడపగడపకూ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:12 AM

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌, టీడీపీ జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు మొదలవలస రమేష్‌ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్లమెంట్‌ పార్టీ విస్తృత సమన్వయ సమావేశం నిర్వహించారు.

గడపగడపకూ సంక్షేమ పథకాలు
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం

ఎమ్మెల్యే గొండు శంకర్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌

శ్రీకాకుళం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌, టీడీపీ జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు మొదలవలస రమేష్‌ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్లమెంట్‌ పార్టీ విస్తృత సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి నెలా చివరి బుధవారం నిర్వహించే సమన్వయ సమావేశాల ద్వారా క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేసి, ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగరేసేలా నాయ కులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చారిత్రా త్మకమన్నారు. పార్లమెంట్‌ పరిధిలోని రోడ్లు, తాగునీరు, విద్యా సంబంధిత పెండింగ్‌ సమస్యలను గుర్తించి త్వరిత గతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామ న్నారు. అంతకు ముందు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:12 AM