Share News

టీడీపీతోనే పేదల సంక్షేమం

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:15 AM

High priority for activists ‘తెలుగుదేశం పార్టీని స్థాపించి.. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్‌’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు.

టీడీపీతోనే పేదల సంక్షేమం
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం

మంత్రి అచ్చెన్నాయుడు

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం

కోటబొమ్మాళి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీని స్థాపించి.. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్‌’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. టీడీపీ ఆవిర్భావ దినం సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోటబొమ్మాళిలోని ఎన్‌టీఆర్‌ భవనం వద్ద, నిమ్మాడలో పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండాను మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలకు వివరించాలి. ప్రభుత్వ పాలనపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల’ని తెలిపారు. అనంతరం పలువురు సీనియర్‌ కార్యకర్తలను మంత్రి అచ్చెన్న సన్మానించారు.

Updated Date - Mar 30 , 2026 | 12:15 AM