మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం: శంకర్
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:50 PM
మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అ న్నారు.
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అ న్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం పెద్ద గనగళ్లపేటలో మత్స్యకారుల నిత్యావసర రేషన్ పంపిణీ కార్యక్రమం చేప ట్టారు. ఐదు రోజులు భారీ వర్షాలు, తుఫాన్ కారణంగా తీరప్రాంత మత్స్య కారులు ఇబ్బం దులు ఎదుర్కొన్నారన్నారు. విపత్కర వాతా వరణం నేపథ్యంలో పది రోజులుగా వేటకు వెళ్ల లేని మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభు త్వం తక్షణం స్పందించిం దన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్ గణపతి, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు మూకళ్ల శ్రీని వాస్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణు గోపాలం, జనసేన నేత కోరాడ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘34 శాతం రిజర్వేషన్ హర్షణీయం’
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణ యించడం హర్షణీయమని, సీఎం చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతిగా నిరూపించుకున్నా రని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమ వారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి సీఎం నిత్యం కృషి చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. పాండ్రంకి శంకర్, కలగ జగదీష్, హరిగోపాల్ పాల్గొన్నారు.