ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:45 PM
కూటమి ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
ఎచ్చెర్ల, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. శనివారం మండలంలోని ఎస్‌ఎంపురంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా రెండేళ్ల నమ్మకం- సంక్షేమ, అభివృద్ధి ప్రత్యేక కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైౖర్మన్ చౌదరి అవినాష్, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ మండలాధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, వెంకటరెడ్డి, పైడి ముఖలింగం, వావిలపల్లి రామకృష్ణ, గొంటి నర్సింగరావు పాల్గొన్నారు.
ఫఇచ్ఛాపురం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొఠారిలో టీడీపీ నాయ కుల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు బోర యువరాజ్, చైర్మన్ సాడి సహ దేవ్‌రెడ్డి, యువరాజ్, దుక్క భీమారావు పాల్గొన్నారు.