సంక్షేమం-అభివృద్ధి ధ్యేయం: ఎన్‌ఈఆర్
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:32 PM
రాష్ట్రం లో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోం దని ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు అన్నా రు.
జి.సిగడాం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోం దని ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు అన్నా రు. మండలంలో గ్రామా ల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయదుందుభి మోగించాలన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన 50 కేజీల బియ్యాన్ని ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు, కూటమి నాయకులు కుమరాపు రవికుమార్, కుదిరెళ్ల బుజ్జి, పైల విష్ణుమూర్తి, వజ్జపర్తి రఘురాం, టంకాల మౌళీశ్వరరావు, బెవర జగన్నాఽథ రావు, తహసీల్దార్ ఎం.సరిత, ఎంపీడీవో జి.రామకృష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.