Share News

కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:25 AM

కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.

 కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి
కరపత్రాలిచ్చి సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

జి.సిగడాం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. శనివారం సర్వే శుపురంలో ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఇంటిం టికీ వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలిచ్చి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇతర అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోందన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దేందుకు సీఎం నారా చంద్రబాబు నాయు డు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాటుపడు తున్నారని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవి కుమార్‌, రైల్వేబోర్డు సలహాబోర్డు సభ్యుడు బాలబొమ్మ వెంకటేశ్వరరావు, నాయకులు చిత్తిరి తిర ుపతిరావు, పొగిరి నారాయణరావు, గోపాల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 12:25 AM