Share News

సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:58 PM

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ కోరారు.

 సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కవిటి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ కోరారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ టీడీపీ నేతలతో బుధ వారం రామయ్యపుట్టుగలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్‌ కోసం సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ ఎంతగా శ్రమిస్తున్నారో ప్రతీ నాయకుడు గ్రహించాలన్నారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంసకర పరిస్థితుల నుంచి నేడు జరుగు తున్న మంచిని ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, కవిటి మండలాల నేతలు పాల్గొన్నారు.

‘రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి’

కవిటి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ కోరారు. రామయ్యపుట్టుగలో బుధవారం జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీ కృష్ణతో వివిధ అంశా లపై చర్చించారు. రైతులకు విత్తనాలు సరఫరా, యాప్‌ ద్వారా ఎరువులు పంపిణీ సక్రమంగా జరిగేలా చూడా లన్నారు. సమావేశంలో వ్యవసాయాధికారులు బి.నర్సింహ మూర్తి, పి.శ్రీదేవి, బి.కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:58 PM