సంక్షేమం, అభివృద్ధే ప్రజల నమ్మకం: కలిశెట్టి
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:37 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధే ప్రజల నమ్మకమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.
లావేరు, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధే ప్రజల నమ్మకమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. గురువారం గోవిందపురంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధిపై రూపొందించిన కరపత్రా లను అందించి ప్రజలకు వివరించారు. కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐ.తోటయ్యదొర, నాయకులు కలిశెట్టి సూర్యనారాయణ, ఆరెళ్ల కృష్ణ, లంక నారాయణరావు, పిన్నింటి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.