పొలాల్లోకి దూసుకెళ్లిన పెళ్లి వ్యాన్
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:45 PM
మండలంలోని పిండ్రువాడ కాలనీ సమీపంలో శనివారం పెళ్లి వ్యాన్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
- పలువురికి గాయాలు
హిరమండలం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పిండ్రువాడ కాలనీ సమీపంలో శనివారం పెళ్లి వ్యాన్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈఘటనలో పలువురికి గాయా లయ్యాయి. బాధితుల వివరాల మేరకు.. హిరమండలం కుమ్మరి వీధిలో జరుగు తున్న పెళ్లికి కంచిలి మండలం శాసనం గ్రామం నుంచి 20 మంది వ్యాన్‌లో బయలుదేరారు. వీరంతా పెళ్లి కుమార్తెకు చెందిన వారు. పిండ్రువాడ కాలనీ వద్దకు వచ్చేసరికి వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదృష్టవశాత్తు వ్యాను బోల్తా పడకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారిని 108 వాహనంలో హిరమండలం పీహెచ్‌సీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.