Share News

‘ఉపాధి’ పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించేదిలేదు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:04 AM

మహాత్మాగాంధీ జాతీయ ఉపా ధి హామీ పథకం (ఎంజీ ఎన్‌ఆర్‌ ఈజీ ఎస్‌) పేరు ను వీబీజీ రామ్‌ జీగా మార్చి.. పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు డా.పూడి కిరణ్‌కుమార్‌ అన్నారు.

‘ఉపాధి’ పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించేదిలేదు
నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

ఇచ్ఛాపురం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మహా త్మాగాంధీ జాతీయ ఉపా ధి హామీ పథకం (ఎంజీ ఎన్‌ఆర్‌ ఈజీ ఎస్‌) పేరు ను వీబీజీ రామ్‌ జీగా మార్చి.. పథకాన్ని నిర్వీ ర్యం చేస్తే సహించేది లేద ని జిల్లా యువజన కాంగ్రె స్‌ అధ్యక్షుడు డా.పూడి కిరణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం పాతబస్టాండ్‌ జంక్షన్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ పథకంలోని గాంధీజీ మారిస్తే జాతిని అవమానించినట్టేనన్నారు. ప్రస్తుతం కొత్త చట్టం ద్వారా కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభు త్వం 40 శాతం నిఽధులు భరించాల్సి ఉందని, దీనివల్ల మన రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందన్నారు. వేత నదారులకు కనీస వేత నం రూ.400 ఉండాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రైతులకు అనుసంధానం చేయాలని కోరారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:04 AM