Share News

బాధితులను ఆదుకుంటాం

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:45 AM

దివ్యాంగులైన ఆ ఇద్దరికి మూడు పదుల వయసు దాడినా.. మూడేళ్ల పిల్లలతో సమానం.

బాధితులను ఆదుకుంటాం
మల్లా నాగేశ్వరరావుతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీష

  • ఎమ్మెల్యే వినతిపై స్పందించిన మంత్రి లోకేశ్‌

  • పుట్టుకతోనే దివ్యాంగుల కుటుంబానికి భరోసా

పలాస, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులైన ఆ ఇద్దరికి మూడు పదుల వయసు దాడినా.. మూడేళ్ల పిల్లలతో సమానం. వీరికి వృద్ధులైన తల్లిదండ్రులే అన్ని తామై చూసుకుంటున్నారు. వీరి పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే గౌతు శిరీష మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. వారిని ఆదుకునేందుకు మంత్రి లోకేశ్‌ భరోసా ఇవ్వడంతో వారంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వి వరాల్లోకి వెళ్తే.. స్థానిక కోమటివీధిలో నివాసం ఉంటు న్న మల్లా నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు సంధ్య (36), స్రవంతి(38). వీరు పుట్టుకతోనే దివ్యాంగులు. చిరు వ్యాపారి అయిన నాగేశ్వరరావు తన కాయకష్టంతో పాటు ప్రభుత్వం నుంచి ఒక కుమార్తెకు వస్తున్న దివ్యాంగ పింఛన్‌ డబ్బులతో నెట్టుకొస్తున్నారు. వారి వైద్యానికి, ఇతర అవసరాలకు చాలీచాలని డబ్బులతో ఇబ్బందిపడుతున్నారు. ఇదిలావుంటే నాగేశ్వరరావు తన ఇద్దరు కుమార్తెలను ఆదివారం సాయంత్రం వీధిలో తిప్పుతుండడాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష చూశారు. వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి వారి పరిస్థితిని చూసి చలించిపోయారు. వారి తండ్రితో మాట్లాడి వారి ద్దరి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఒక కుమా ర్తెకు దివ్యాంగ పింఛన్‌ వస్తుందని, రెండో కుమార్తెకు కూడా పింఛన్‌ మంజూరు చేయిస్తే కాస్త ఆసరాగా ఉంటుందని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై తక్షణమే ఎమ్మెల్యే స్పందించి ఈ విషయాన్ని మంత్రి లోకేష్‌ పేషీకి తెలియజేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్‌ ఆ ఇద్దరు పిల్లల పరిస్థితిపై సోమవారం అడిగి తెలుసుకుని న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. కాగా ఎమ్మెల్యే అభ్యర్థనపై మంత్రి లోకేశ్‌ తక్షణం స్పందించడంపై ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 14 , 2026 | 12:45 AM