దానయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:59 PM
దానయ్య కుటుంబానికి తాము అండంగా ఉంటా మని, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. అమాయక కార్యకర్తను బలిపశువు చేశారని, కుమారుడ్ని రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విఫలయత్నం చేశారని ఆరో పించారు.
పలాస, జూలై 13(ఆంధ్రజ్యోతి): దానయ్య కుటుంబానికి తాము అండంగా ఉంటా మని, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. అమాయక కార్యకర్తను బలిపశువు చేశారని, కుమారుడ్ని రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విఫలయత్నం చేశారని ఆరో పించారు. సోమవారం పలాసలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మూడు రోజుల కిందట గొర్రెల కాపరి దుబ్బ దానయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని, దీనికి మాజీ మంత్రి తనయుడు కారకుడైతే ఆయన్ను తప్పించి సిద్థార్ధత్యాడి అనే వ్యక్తిని బలిపశువు చేసిన ఘనత అప్పలరాజుకే దక్కిందన్నారు. యాదవ సామాజికవర్గానికి చెందిన దానయ్య మృతిచెందిన మూడురోజుల తర్వాత సీసీపుటేజీ ఆధారంగా అసలు విషయం బహిర్గతమైందన్నారు. తన కుమారుడి వల్ల మృతి చెందిన బీద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి కేసు తప్పుదారి పట్టించి కుమారుడ్ని కాపాడుకో వడానికి ఆయన చేసిన ప్రయత్నం తప్పన్నారు. గతంలో టీడీపీ కార్యకర్త వల్ల డోకి హరీష్ మృతి చెందితే కులాల మధ్య విధ్వంసం రెచ్చగొట్టి రాద్దాంతం చేసి ఓటుగా మలుచుకున్నారని, బాలిక అత్యాచారం కేసు రాజకీయం చేసి బేరసారాలు చేపట్టారని ఆరోపించారు. తన కుమారుడి విషయానికి వచ్చేసరికి నిజాన్ని నొక్కిపెట్టి అమాయక కార్యకర్తను బలిచేయడానికి సిద్ధపడడం ప్రజలకు ఏమి సందేశం ఇవ్వనున్నారో స్పష్టం చేయాలన్నారు.
పారదర్శకంగా ఎరువుల పంపిణీ
వజ్రపుకొత్తూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరు తుందని ఎమ్మెల్యే శిరీష తెలిపారు. వజ్రపుకొత్తూరులో పీఏసీఎస్ చైర్మన్ సురేష్ ఆధ్వర్యంలో ఎరువులు పంపణీచేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర చైర్మన్ వజ్జ బాబురావు, టీడీపీ మండలాధ్యక్షుడు మోహనరావు, అగ్నికులక్షత్రి కార్పొరేషన్ డైరక్టరు ఈశ్వరరావు, ఉమామహేశ్వరరావు, సూర్యనారాయణ, విఠల్ పాల్గొన్నారు.
ఫపలాసరూరల్, జూలై13(ఆంధ్రజ్యోతి): పలాస పీఏసీఎస్ కార్యాలయంలో ఎరువుల పంపిణీ ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వంకల కూర్మారావు, టీడీపీ మండలాధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్, అవుగాన షణ్ముఖరావు,బడ్డ నాగరాజు, గాలి కృష్ణారావు, కుమార్‌రాజు పాల్గొన్నారు.