Share News

కోళ్ల రైతులను ఆదుకుంటాం

ABN , Publish Date - May 25 , 2026 | 11:52 PM

'Summer crisis for the poultry industry' ‘తీవ్ర ఎండలు, వడగాల్పుల ప్రభావంతో నష్టపోయిన కోళ్ల రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వారిని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామ’ని ఏడీ బి.దుర్గారావు అన్నారు. ‘పౌలీ్ట్ర పరిశ్రమకు వేసవి గండం’ అనే శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు.

కోళ్ల రైతులను ఆదుకుంటాం
కమ్మసిగడాం లేయిర్‌ కోళ్ల ఫారంను పరిశీలిస్తున్న ఏడీ బీ దుర్గారావు

ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తాం

ఏడీ దుర్గారావు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

రణస్థలం, మే 25(ఆంధ్రజ్యోతి): ‘తీవ్ర ఎండలు, వడగాల్పుల ప్రభావంతో నష్టపోయిన కోళ్ల రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వారిని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామ’ని ఏడీ బి.దుర్గారావు అన్నారు. ‘పౌలీ్ట్ర పరిశ్రమకు వేసవి గండం’ అనే శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. రణస్థలం మండలంలో పలు కోళ్లఫారాలను పరిశీలించారు. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, ఉక్కపోత కారణంగా లేయర్‌, బాయిలర్‌ కోళ్లు మృతి చెందాయని గుర్తించారు. కమ్మసిగడాం సమీపాన ఉన్న లేయిర్‌కోళ్ల ఫారంలో సోమవారం ఒక్కరోజే 1000 కోళ్లు మృతి చెందాయని ఏడీ దుర్గారావు తెలిపారు. ఇప్పటివరకూ ఈ కోళ్లఫారంలో సుమారు 18వేల కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు. అలాగే సీతారాంపురం, వేల్పురాయి, పాతర్లపల్లి, లెంకపేట తదితర గ్రామాల్లో బాయిలర్‌ కోళ్లు ఉక్కపోతకు మృతి చెందినట్లు గుర్తించారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 11:52 PM