Share News

ఎయిర్‌పోర్టు బాధితులకు అండగా నిలుస్తా

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:04 AM

ఎయిర్‌పోర్టు బాధిత రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించి, వారి పిల్లలకు తాను అండగా నిలుస్తానని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.

ఎయిర్‌పోర్టు బాధితులకు అండగా నిలుస్తా
హరిపురం: ఎయిర్‌పోర్టు బాధిత రైతులతో మాట్లాడుతున్న గౌతు శిరీష:

హరిపురం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఎయిర్‌పోర్టు బాధిత రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించి, వారి పిల్లలకు తాను అండగా నిలుస్తానని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మందస మండలం రాంపురం గ్రామ సచివాలయ భవనంలో రైతులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్గో ఎయిర్‌పోర్టు అంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిస్థాయిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు అని చెప్పారు. ఇక్కడి నుంచి అన్నిరకాల విమానాల రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఎక్కువగా సాయం అందించి, పునరావాసం కల్పిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, కొర్ల కన్నారావు, దాసరి తాతారావు, సాలిన మాధవరావు, జానకిరావు, లబ్బ రుద్రయ్య, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రీయ విద్యాలయంలో పారదర్శకంగా అడ్మిషన్లు

కాశీబుగ్గ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పలాసలోని కేంద్రీయ విద్యాలయంలో పార దర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మంగళవారం రైల్వే పాఠశాల తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్న కేంద్రీయవిద్యాలయా న్ని పరిశీలించారు. అక్కడ తరగతుల నిర్వహణకు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉం డేందుకు తాత్కాలిక క్వార్టర్ల ఏర్పాటుగురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్రీయ విద్యా విభాగం నిబంధనల మేరకు అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. ఆమె వెంట ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్‌ కళ్యాణచక్రవర్తి, ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ కార్యదర్శి సప్ప నవీన్‌, గాలి కృష్ణారావు, మల్లిపెద్ది చిన్ని ఉన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:04 AM