Share News

గిరిజన సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:04 AM

Tribal aria problems గిరిజన సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.బొజ్జిరెడ్డి తెలిపారు. సోమవారం మెళియాపుట్టిలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో.. పలు సమస్యలపై వినతులు స్వీకరించారు.

గిరిజన సమస్యలు పరిష్కరిస్తాం
మాట్లాడుతున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డి

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డి

మెళియాపుట్టి, మార్చి 23(ఆంఽధ్రజ్యోతి): గిరిజన సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌.బొజ్జిరెడ్డి తెలిపారు. సోమవారం మెళియాపుట్టిలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో.. పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ‘మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో జూనియర్‌ కళాశాలలు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యకు దూరమవుతున్నాం. జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలి. జిల్లాలో కొంతమంది అనర్హులు ఎస్టీ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. బెంతుఒరియా కులస్థులు ఎస్టీలు కాదు. కానీ కొంతమంది ఎస్టీ కుల ధ్రువపత్రాలు పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. మెళియాపుట్టిలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. గిరిజన గ్రామాలకు నిధులు వచ్చినా.. రహదారుల పనులు పూర్తికావడం లేదు. ట్రైకార్‌ రుణాలు గిరిజనేతరులకు అందజేస్తున్నారు. అర్హులకే ఉద్యోగాలు, రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలి. రహదారుల నిర్మాణం పూర్తిచేయాల’ని పలువురు గిరిజనులు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అంతకుముందు దీనబంధుపురం గ్రానైట్‌ పరిశ్రమను పరిశీలించారు. కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఎస్టీ కమిషన్‌ సభ్యులు సునీత, మల్లేశ్వరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్టమూర్తి, ఏపీసీఎస్‌ అధ్యక్షుడు ఎస్‌.మోహనరావు, మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్‌.వెంకటరావు, మాజీ ఎంపీపీ బైరిశింగి లక్ష్మీనారాయణ, ధరణి, జడ్పీటీసీ ఎండయ్య, గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు చౌదరి లక్ష్మీనారాయణ, శ్రీను, దినకర్‌, రాజశేఖర్‌రెడ్డి, ఎం.శ్రీధర్‌, తహసీల్దార్‌ బి.పాపారావు, ఎంపీడీవో ప్రసాద్‌పండా, ఎంఈవో దేవేంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 12:04 AM