రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:03 AM
Officials visit airport-displaced villages రెవెన్యూ పరిధిలోని భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు.
ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్
ఎయిర్‌పోర్టు నిర్వాసిత గ్రామాల్లో అధికారుల బృందం పర్యటన
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ పరిధిలోని భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు, పాతపట్నం తహసీల్దార్లు సీతారామయ్య, ప్రసాదరావుతో కలిసి.. ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాలైన అనకాపల్లి, ఒంకులూరు, మోట్టూరులో ఆయన పర్యటించారు. స్థానిక రైతులతో మాట్లాడారు. గతంలో ఈ ప్రాంతాల్లో రీ సర్వే జరిగినా ఇప్పటికీ అనేక తప్పులు ఉన్నట్లు రైతులు వివరించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను అనేకసార్లు కోరినా ఫలితం లేకపోయిందని వాపోయారు. దీనిపై డిప్యూటీ కలెక్టర్ స్పందిస్తూ.. ‘ఇప్పటికే ఏర్పాటు చేసిన పది మంది వీఆర్వోల బృందం ఇంటింటికీ వెళ్ళి వివరాలు సేకరిస్తోంది. సమస్యలు పరిష్కరిస్తాం. కొన్ని భూముల విషయంలో సర్వేయర్ పరిశీలించిన తర్వాత శాశ్వత భూ హక్కుదారులను గురిస్తాం. అధికారులకు రైతులు సహకరించాలి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక సచివాలయాల్లో ఫిర్యాదు చేయాల’ని సూచించారు. ఏ ఒక్క రైతూ ఆందోళన చెందవద్దని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మనోహర్, వీఆర్వోలు షణ్ముఖరావు, ప్రసాదరావు, కాశీబుగ ్గరూరల్ సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ నిహార్ పాల్గొన్నారు.