దామోదరసాగర్‌కు మరమ్మతులు చేస్తాం
ABN , Publish Date - May 19 , 2026 | 11:54 PM
: దామోదరసాగర్ ఆయకట్టు రైతుల కష్టాలను రానున్న ఖరీఫ్‌నుంచి తీరుస్తామని జలవనరుల శాఖ ఎస్‌ఈ సుధాకర్ తెలిపారు. మంగళవారం మందస మండలంలోని దామోదర సాగర్ కుడి కాలువను జలవనరులు అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు.
హరిపురం, మే19 (ఆంధ్రజ్యోతి): దామోదరసాగర్ ఆయకట్టు రైతుల కష్టాలను రానున్న ఖరీఫ్‌నుంచి తీరుస్తామని జలవనరుల శాఖ ఎస్‌ఈ సుధాకర్ తెలిపారు. మంగళవారం మందస మండలంలోని దామోదర సాగర్ కుడి కాలువను జలవనరులు అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విన్నపం మేరకు కుడి కాలువను పరిశీలించామని, అన్నదాతల సాగునీటి కష్టాలు తొలగించి పూర్తిస్తాయి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరక్టర్ బావన దుర్యోధన మాట్లాడుతూ కుడికాలువ అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ డీఈఈ సత్యప్రసాద్, ఏఈఈ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఎం. చంద్రశేఖర్, అగ్గున్న జయరాజు, డొక్క లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.