‘ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం’
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:46 PM
వంశధార ద్వారా ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రాజెక్టు కమిటి చైర్మన్ ఎ. రవీంద్రబాబు అన్నారు.
హిరమండలం, జూన్6(ఆంధ్రజ్యోతి): వంశధార ద్వారా ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రాజెక్టు కమిటి చైర్మన్ ఎ. రవీంద్రబాబు అన్నారు. శనివారం గొట్టా దిగువ ప్రాంతంలో జరుగుతున్న జడ్జిస్టోన్ ఏప్రాన్, సీసీ బ్లాకుల పనులను ఆయన పరిశీలించారు. పనులకు సంబంధించిన వివరాలను ఎస్‌ఈ జి.రామచంద్రరావునుఅడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్‌కు శివారు భూముల వరకు నీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కాలువల మరమ్మతుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. వంశధార సర్కిల్‌లో ఓఎన్‌ఎమ్ గ్రాంట్స్ కింద 226 పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. టెక్కలి డివిజన్‌లో 76, నరసన్నపేట డివిజన్‌లో 116 పనులు మంజూరయ్యాయని చెప్పారు. బ్యారేజి దిగువన ఏప్రాన్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ మురళీమోహన్‌రావు, డీఈ సరస్వతి, జేఈ పరిశుద్ధబాబు పాల్గొన్నారు.