Share News

ప్రతి ఇంటికీ తాగు నీరందిస్తాం

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:41 PM

టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లో రూ.650 కోట్లతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టును ఏడాదిన్నరలోపు పూర్తి చేసి, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

 ప్రతి ఇంటికీ తాగు నీరందిస్తాం
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

-మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లో రూ.650 కోట్లతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టును ఏడాదిన్నరలోపు పూర్తి చేసి, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం నిమ్మాడలో తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం గ్రామీణా భివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నేతలు రోణంకి లీలామోహన్‌, చల్ల రాము, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 11:41 PM