Share News

60 డివిజన్లలో సత్తాచాటుతాం: శంకర్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:55 PM

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రథమ స్థానంలో నిల పడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

60 డివిజన్లలో సత్తాచాటుతాం: శంకర్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం అర్బన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రథమ స్థానంలో నిల పడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శనివారం విశాఖ-ఏ కాలనీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికల్లో నగరంలోని 60 డివిజన్లను కైవసం చేసుకుని కూటమి సత్తా చాటుతామన్నారు. నియోజక వర్గంలో ఇప్పటికే రూ.80 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని, మరో రూ.80 కోట్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయ న్నారు. త్వరలో నగర కార్పొరేషన్‌ పరిధిలో రూ. 200 కోట్ల పనులకు టెండర్లు పిలుస్తు న్నామన్నారు. టీడీపీ నాయకులు పీఎంజే బాబు, మూకళ్ల శ్రీను, మైలపల్లి నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 11:55 PM