టీడీపీ కార్యకర్తల గౌరవాన్ని పరిరక్షిస్తాం
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:41 PM
టీడీపీ కార్యకర్తగా గర్వపడేలా వారి గౌర వాన్ని పరిరక్షిస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మెళియాపుట్టి మండలంలోని జాడుపల్లి పంచాయతీ పరిధి నుంచి వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిని పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు టీడీపీ కండువాలను వేసి సోమవారం ఆహ్వానించారు.
పాతపట్నం, జూన్ 8(ఆంధజ్ర్యోతి): టీడీపీ కార్యకర్తగా గర్వపడేలా వారి గౌర వాన్ని పరిరక్షిస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మెళియాపుట్టి మండలంలోని జాడుపల్లి పంచాయతీ పరిధి నుంచి వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిని పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు టీడీపీ కండువాలను వేసి సోమవారం ఆహ్వానించారు. మెళియాపుట్టి మండలం లోని జాడుపల్లి పంచాయతీలోని బూత్‌నెంబరు-112లో సవర జాడుపల్లి, రంగడు గాటి, ఎగువ జాడుపల్లి గ్రామాల నుంచి సుమారు 150 వరకు గిరిజనులు, హరి జనులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వార్డు మాజీ సభ్యురాలు పసుపురెడ్డి తేజమ్మ,ఎంపీటీసీ మాజీ సభ్యులు కైలాస్ గొమాంగొ, పసుపురెడ్డి చెన్నయ్య, కొర్రె కృ ష్ణారావు పిలక తివయ్య, పాలక ఆదినారాయణ, పసుపురెడ్డి లక్ష్మణరావు, పసుపురెడ్డి నిమ్మరాజు, కోరాడ లక్ష్మీనారాయణ, పసుపురెడ్డి శ్రీనివాసరావు, కొరాయి దివ్య, మీసాల రాజు, రాములమ్మ, కురాయి తవిటమ్మ సవర సుశీల, సవర ఆదమ్మ, సవర శాంతి, సవర రాణి తదితరుల ఆధ్వర్యంలో ఆయా కుటుంబాలు టీడీపీలో చేరాయి.