టిడ్కో లబ్ధిదారులకు నగదు చెల్లిస్తాం
ABN , Publish Date - May 18 , 2026 | 11:24 PM
టిడ్కో లబ్ధిదారులందరికీ పెండింగులో ఉన్న మొత్తం నగదు తిరిగి చెల్లించనున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్, టిడ్కో సిబ్బందితో సమీక్షించారు.
పలాస, మే 18(ఆంధ్రజ్యోతి): టిడ్కో లబ్ధిదారులందరికీ పెండింగులో ఉన్న మొత్తం నగదు తిరిగి చెల్లించనున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్, టిడ్కో సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టిడ్కో గృహాలు పూర్తి చేయలేకపోవడంతోపాటు ఇళ్లు రాని వారికి బకాయిలు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం గృహ నిర్మాణాలు వేగవంతం చేయడంతో పాటు ఇళ్లు రానివారు కట్టిన నగదు తిరిగి వారికి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొందరలోనే వారి బ్యాం కు ఖాతాల్లోకి నగదు జమ చేస్తామన్నారు. లబ్ధిదారుల వివరాలు ఇప్పటికే సిద్ధం చేశామని స్పష్టం చేశారు. తొందరలోనే టిట్కో గృహాలు పూర్తయిన వారికి ఇళ్లు కూడా అప్పగించడానికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. సమావేశంలో కమిషనర్ ఇ.శ్రీనివాసులు పాల్గొన్నారు.