Share News

ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:21 PM

గ్రామాల నుంచి వలసల నివారణకు, స్థానికంగా బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిర్వీ ర్యం చేస్తే ఊరుకునేది లేదని కేంద్ర మాజీ మంత్రి డా. కిల్లి కృపారాణి అన్నారు.

ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం
గమేళాను తలపై పెట్టుకుని నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నేతలు

అరసవల్లి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): గ్రామాల నుంచి వలసల నివారణకు, స్థానికంగా బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిర్వీ ర్యం చేస్తే ఊరుకునేది లేదని కేంద్ర మాజీ మంత్రి డా. కిల్లి కృపారాణి అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఆదివారం స్థానిక మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, ఏఐసీసీ జాతీయ కోఆర్డినేటర్‌ డా.దువ్వాడ జీవితేశ్వరరావులతో కలిసి నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేదల ఉపాధిని నిర్వీర్యం చేస్తే బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం పేరులో నుంచి గాంధీజీ పేరును తొలగించడం ఈ జాతిని అవమానించడమేన న్నారు. జాతిపిత పేరును జనం మరిచిపోయేలా చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అది సాధ్యం కాదన్నారు. నిజానికి ఈ పథకం ద్వారా అత్యధికంగా లబ్ది పొందుతున్నది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమేనన్నారు. ఈ పథకం లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్రం వాటా 10 శాతం ఉండేదని, కానీ ప్రస్తుత కొత్త చట్టం ద్వారా కేంద్రం వాటాను 60 శాతానికి తగ్గించడం ద్వారా రాష్ట్ర ఖజానా పై అదనపు భారం పడుతుందన్నారు. దీనివల్ల దేశంలో అత్యధికంగా నష్టపోయేది మన రాష్ట్రమేనని అన్నారు.

కొత్త చట్టం వల్ల గ్రామీణ యువత, మహిళలు తీవ్రంగా నష్టపోతారని, నిరుద్యోగ సమస్య ఉత్పన్నమవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం కొత్త చట్టాన్ని రద్దు చేసి ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ పథకాన్ని రక్షించుకునేందుకు 98730 10606 నెంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి, క్యూఆర్‌ కోడ్‌ ని స్కాన్‌ చేయాలని కోరారు. తొలుత గాంధీజీ విగ్రహా నికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గమేళాను తలపై పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మహేష్‌, నగర యువత అధ్యక్షుడు రెల్ల సురేష్‌, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూడి కిరణ్‌కుమార్‌, నేతలు మంత్రి నర్సింహమూర్తి, కె.మల్లేశ్వరరావు, ఎం.చక్రవర్తిరెడ్డి, మామిడి సత్యనారాయణ, ఆబోతుల వెంకటనాయుడు, సీపీఎం నాయకుడు తిరుపతిరావు, రైతు సంఘం నాయకులు, పలువురు ఉపాధి వేతనదారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:21 PM