Share News

భూ సమస్యలు రానివ్వం

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:17 PM

రైతులకు భూ సమస్యలు రాకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

భూ సమస్యలు రానివ్వం
రైతులకు పాసు పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

- ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

మెళియాపుట్టి(కొత్తూరు), సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రైతులకు భూ సమస్యలు రాకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శనివారం కొత్తూరు మండలం పారాపురంలో రాజముద్రతో ముద్రించిన కొత్త పాసుపుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి కాకుండా మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే రైతుల భూములు మిగలేవి కావన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులకు సమయం సరిపోతుందని తెలిపారు. ఏ ఒక్కరైతు భూమి ఇతరులకు వెళ్లకుండా కాపాడడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.సరోజిని, టీడీపీ నాయకులు మాధవరావు, తులసీవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కాఫీ విత్‌ ఎమ్మెల్యే పోస్టర్‌ ఆవిష్కరణ

పాతపట్నం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఈనెల 10 నుంచి నిర్వహించనున్న కాఫీ విత్‌ ఎమ్మెల్యే కార్యక్రమానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ‘కాఫీ విత్‌ ఎమ్మెల్యే’ పోస్టర్‌ను శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రతీ గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పన, సమస్యలపై అధ్యయనం చేసేందుకు, కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిదన్నారు. చిత్తశుద్ధితో కార్యక్రమం నిర్వహణకు సమాయత్తం కావాలని అన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 11:17 PM