Share News

‘శ్రీకాకుళంలో ఫ్యాక్షన్‌ కుట్రలు సాగనివ్వం’

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:03 AM

ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో రాయ లసీమ తరహా ఫ్యాక్షన్‌ రాజకీయాలను వైసీపీ నేతలు ప్రోత్సహిస్తే ఆ కుట్రలు సాగనిచ్చేది లేద ని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.

‘శ్రీకాకుళంలో ఫ్యాక్షన్‌ కుట్రలు సాగనివ్వం’
మాట్లాడుతున్న టీడీపీ నేతలు

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో రాయ లసీమ తరహా ఫ్యాక్షన్‌ రాజకీయాలను వైసీపీ నేతలు ప్రోత్సహిస్తే ఆ కుట్రలు సాగనిచ్చేది లేద ని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. సోమ వారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గొండు శంకర్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు, ఆ పార్టీ ఇతర నేతలు చేసిన అసత్య, అనుచిత వ్యా ఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్‌ సామాన్య కుటుం బం నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతుడని, ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవా లని హితవు పలికారు. తన సొంత నిధులతో రోడ్లు వేయించడం, దేవాలయాలను అభివృద్ధి చేయడం, కులమతాలకు అతీతంగా పండగలకు ఆర్థిక సాయం అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన అనేక ఏళ్లుగా చేస్తున్నా రని గుర్తు చేశారు. కేవలం ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి దిగజారుడు ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన ఏదేళ్లలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలు ఇంకా మరిచిపో లేదన్నారు. ధర్మాన ప్రసాదరావు సీబీఐ కేసుల్లో ఐదో ముద్దాయి గా ఉన్నారని, మధుర వాడ, పరవాడ ప్రాంతాల్లో ఏకంగా 72 ఎకరాల భూ కబ్జాలకు పాల్పడిన చరిత్ర ఆయనదేనని ధ్వజమె త్తారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యే శంకర్‌ను ధర్మాన విమర్శించడం హాస్యా స్పదంగా ఉందన్నారు. సమావేశంలో అంపోలు , అరసవల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌లు సింతు సుధాకర్‌, గొండు వెంకటరమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేష్‌, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పాండ్రంకి శంకర్‌, మూకళ్ల శ్రీనివాస్‌, ఎస్సీఎస్‌సి సెల్‌ నాయకుడు గోర సురేష్‌, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్‌ పీఎంజేబాబు, రాష్ట్ర కళింగ వైశ్య డైరెక్టర్‌ పొట్నూరు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:03 AM