ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చుతాం
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:14 AM
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని ఎమ్మెల్యే మామిడి గోవింరావు తెలిపారు.
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని ఎమ్మెల్యే మామిడి గోవింరావు తెలిపారు. తన క్యాం పు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో నియోజక వర్గ పరిధిలోని ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్తూరు మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు యువత కోరారు. కొత్తూరు మండలం కృష్ణా పురంలో ఈశ్వరుడి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరీ చేయాలని కోరారు. మెళియాపుట్టి మండలం కొత్తూరులో రచ్చబండ ఏర్పాటు చేయాలని, టవర్ ఏర్పాటు చేయాలి పలువురు కోరారు. ఇలా వివిధ సమస్యలపై 28 వినతులు అందాయన్నారు. స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యా ర్థి కడింటి వంశీ సాఫ్ట్‌టెన్నీస్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడంతో ఆ క్రీడాకారుడు సోమవారం ఎమ్మెల్యేను కలుసుకున్నారు. క్రీడాకారుడి అభి నందించి రూ.10 వేలు సాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పూజారి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.