Share News

ప్రాణాలైనా అర్పిస్తాం.. కొండను మాత్రం ఇవ్వబోం

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:54 PM

Protest against the establishment of industries ‘ఎన్నో ఏళ్ల నుంచి కొండే ఆధారంగా జీవనం సాగిస్తున్నాం. నిరుపేదలమైన మాకు అప్పట్లో పట్టాలు కూడా ఇచ్చారు. ఈ కొండపైనే వ్యవసాయం చేస్తూ.. ఫలసాయం వచ్చే మొక్కలను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాం. ఆవులు, మేకలు, గొర్రెలు వంటి మూగజీవాలకు కూడా ఈ కొండే ఆధారం. ఈ కొండ లేకపోతే తమ బతులకు ఎలా సాగుతాయ’ంటూ నడిమివలస, గదబపాలెం రైతులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాణాలైనా అర్పిస్తాం.. కొండను మాత్రం ఇవ్వబోం
నిరసన వ్యక్తం చేస్తున్న నడిమివలస , గదబపాలెం గ్రామస్థులు

నడిమివలసలో పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసన

జి.సిగడాం, జూలై 12(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నో ఏళ్ల నుంచి కొండే ఆధారంగా జీవనం సాగిస్తున్నాం. నిరుపేదలమైన మాకు అప్పట్లో పట్టాలు కూడా ఇచ్చారు. ఈ కొండపైనే వ్యవసాయం చేస్తూ.. ఫలసాయం వచ్చే మొక్కలను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాం. ఆవులు, మేకలు, గొర్రెలు వంటి మూగజీవాలకు కూడా ఈ కొండే ఆధారం. ఈ కొండ లేకపోతే తమ బతులకు ఎలా సాగుతాయ’ంటూ నడిమివలస, గదబపాలెం రైతులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నడిమివలస కొండపై పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆదివారం నిరసన చేపట్టారు. ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ పరిశ్రమల కోసం కొండను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

నడిమివలస- గదబపాలేం గ్రామాల సమీపంలో ఉన్న కొండపై 36, 38 సర్వే నెంబర్లలో సుమారు 202 ఎకరాల్లో ఏపీఐఐసీ పరిశ్రమల వాడ ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న సర్పంచ్‌ బాలి సావిత్రమ్మ సమక్షంలో, ఈ నెల 7న తహసీల్దార్‌ ఎం.సరిత ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించారు. కొండపై పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆదివారం ఆ రెండు గ్రామస్థులు నడిమివలస రామాలయం వద్ద పెద్దల సమక్షంలో సమావేశమయ్యారు. కొండపై పరిశ్రమ ఏర్పాటు కోసం ఎవరూ పట్టాలివ్వరాదని తీర్మానించారు. అవసరమైతే ఆమరణ, రిలే నిరాహారదీక్షకు దిగుతామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మీసాల వెంకటరమణ, ఆబోతుల జగన్నాథం, మాజీ సర్పంచ్‌ బాలి సావిత్రమ్మ, బాలి అప్పలసూరి, బాలి రమేష్‌, ఇజ్జురోతు రమేష్‌, బాలి గోవింద, లక్ష్మణరావు, డిల్లీ, మీసాల లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:54 PM