రిమ్స్‌ను అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:59 PM
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)ను అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిని ఆకస్మికంగా పర్యటించి, రోగులకు అందజేస్తున్న సేవలు, మందులపై ఆరాతీశారు.
శ్రీకాకుళం రిమ్స్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)ను అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిని ఆకస్మికంగా పర్యటించి, రోగులకు అందజేస్తున్న సేవలు, మందులపై ఆరాతీశారు. లైబ్రరీ, లెక్చరర్ హాలును పరిశీలించారు. ఫర్నీచర్ అవ సరమని తెలుసుకుని వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడారు.త్వరలో ఈ రెండు హాల్స్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆడిటో రియం, లేడీస్ హాస్టల్ భవనాలను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అప్పలనాయుడు, ఆర్‌ఎంవో సుభాషిణి పాల్గొన్నారు.
విలువ ఆధారిత ఉత్పత్తులతో స్థిర ఆదాయం
ఆమదాలవలస, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతులకు స్థిర ఆదాయం లభిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. రైతులు కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా వాటిని ప్రాసెస్ చేసి గ్రూప్‌లుగా ఏర్పడిమార్కెటింగ్ నిర్వహిస్తేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుం దనిచెప్పారు. శుక్రవారం ఆమదాలవలసలోని కృషివిజ్ఞాన కేంద్రంలో కేవీకే, వ్యవ సాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కిసాన్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక వ్యవసాయాధికారిత వ్యాపారవేత్త రూపుదిద్దుకోవాలన్న లక్ష్యంతో కృషి విజ్ఞాన కేంద్రాల్లో రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాల య విస్తరణ సంచాలకుడు డాక్టర్ శివనారాయణ పెసర పంటలో విలువ ఆధారిత ఉత్పత్తుల వల్ల వచ్చే అదనపు లాభాలను వివరించారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవీసత్యనారాయణ, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ప్రాంతీయ వ్యవసాయపరిశోధనా స్థానం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ సీహెచ్ ముకుందరావు, కేవీకే అధిపతి డాక్టర్ కె.భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.