Share News

పక్షుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:59 PM

Conservation of foreign birds తేలుకుంచి గ్రామంలో విదేశీ పక్షుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి.. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఏ. మురళీ కృష్ణమనాయుడు అన్నారు.

పక్షుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం
పక్షుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి మురళీకృష్ణమనాయుడు

ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి మురళీ కృష్ణమనాయుడు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ఇచ్ఛాపురం, జనవరి 29(ఆంధ్ర జ్యోతి): తేలుకుంచి గ్రామంలో విదేశీ పక్షుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి.. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఏ. మురళీ కృష్ణమనాయుడు అన్నారు. తేలు కుంచిలోని విడిది కేంద్రంలో సరైన ఏర్పాట్లు లేక విదే శీ పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యం లో ‘విదేశీ పక్షులు విలవిల’ శీర్షికతో గురువారం ‘ఆం ధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అటవీశాఖ అధి కారులు స్పందించారు. పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఏ.మురళీ కృష్ణమనాయుడు పరిశీలిం చారు. ‘పక్షుల సంరక్షణ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో నివేదిక పంపాం. నిదులు రాకపోవటంతో పనులు చేపట్టలేకపోయాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాద నలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే పక్షుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం. గ్రామస్థుల సహకా రంతో పక్షులకు నష్టం కలుగకుండా ఏర్పాట్లు చేశామ’ని మురళీ కృష్ణమ నాయుడు తెలిపారు.

Updated Date - Jan 29 , 2026 | 11:59 PM