Share News

పాఠశాల భవనాలు పూర్తిచేస్తాం

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:36 PM

రానున్న విద్యాసంవత్సరం ప్రారంభానికి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణాలు పూర్తిచేయిస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.

  పాఠశాల భవనాలు పూర్తిచేస్తాం
పారిశుధ్యకార్మికులకు సత్కరిస్తున్న బగ్గు రమణమూర్తి :

పోలాకి, ఫిబ్రవరి, 21(ఆంధ్రజ్యోతి): రానున్న విద్యాసంవత్సరం ప్రారంభానికి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణాలు పూర్తిచేయిస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం గొల్లలవలస, సంతలక్ష్మీపురం పాఠశాలల్లో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణపై అవగాహన ర్యాలీ, మానవహారం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రతిజ్ఞచేయిం చారు. వీఽధుల్లో ఎమ్మెల్యేతోపాటు టీడీపీ సమన్వయకర్త బగ్గుఅర్చన చెత్తను ఊడ్చారు. గొల్లలవలస చెత్త సంపద కేంద్రం వద్ద సదస్సు నిర్వహించారు. అనంతరం పారిశుధ్యకార్మికులను ఎమ్యెల్యే సత్కరించారు.కార్యక్రమంలో తహసీల్దార్‌ పొన్నాడ శ్రీనివాసరావు, ఎంఈవోలు శ్రీనివాసనాయక్‌,రెడ్డి, జిల్లా కోర్డినేటర్‌ సత్యనారాయణ, కృష్ణంనాయుడు, భాస్కరరావు, నారాయణదాస్‌, సింహాచలం, తాడేల ముఖుందరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 11:36 PM