మలేషియాలో చిక్కుకున్న వారిని తీసుకొస్తాం
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:11 AM
ఉపాధి కోసం మలేషియా వెళ్లి పలు రకాల కారణాలతో అక్కడ చిక్కుకున్న యువకులను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయు డు సహకారంతో స్వస్థలాలకు తీసుకొస్తామని ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ భరోసాఇచ్చారు.
సోంపేట రూరల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం మలేషియా వెళ్లి పలు రకాల కారణాలతో అక్కడ చిక్కుకున్న యువకులను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయు డు సహకారంతో స్వస్థలాలకు తీసుకొస్తామని ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ భరోసాఇచ్చారు. గురువారం కవిటి మండలంలోని రామయ్యపుట్టుగలోని క్యాంప్ కార్యాలయంలో సోంపేట మండలంలోని ఎర్రముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయివంశీ, వజ్రపుకొత్తూరు మండలంలోని వంకులూరు, గడూరు గ్రామాలకు చెందిన లండ తరుణ్, చొక్కర సాయికుమార్ తల్లిదండ్రులు అశోక్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదివరకే ఈసమస్యను కేంద్రమంత్రి మలేషియాలో భారత ఎంబీసీతో సంప్రదింపులు జరిపారని, చట్టపరమైన అడ్డంకులు నేపధ్యంలో ఆలస్యం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్ పాల్గొన్నారు.
ఫకంచిలి, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఆసరాగా ఉంటుందని ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. మండలంలోని కొల్లూరుకు చెందింన రంగాల లక్ష్మికి రూ.1,08,600, కంచిలికి చెందిన కొత్తకోట వెంకటరమణకు రూ.42,880ల సీఎం సహాయనిధి చెక్కులను రామయ్యపుట్టుగ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, మాదిన రామారావు, వాసాల రమేష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, చినబాబురెడ్డి పాల్గొన్నారు.
ఫ కవిటి, ఆక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రామయ్యపుట్టుగలో నియోజకవర్గంలోని 21 కుటుంబాలకు 13,36, 471 విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లు పంపిణీ చేశారు.