పరిశుభ్రతపై చైతన్యం తీసుకువస్తాం
ABN , Publish Date - May 31 , 2026 | 11:13 PM
33
పలాస, మే 31(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రతపై ప్రజలకు చైతన్యం తీసుకువచ్చి క్లీన్ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీ ట్రేడ్‌ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం జంట పట్ట ణాల్లోని ఉదయపురం కాలనీలో ఆపరేషన్ క్లీన్‌స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపౌరుడు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎక్కడి పడితే అక్కడ చెత్త వేయవద్దని, నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వేయాలని సూచించారు. మునిసిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు మాట్లాడుతు పట్టణాభివృద్ధిలో పరిశుభ్రత కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, డొక్కరి శంకర్, కె.సురేష్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.