Share News

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:56 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

శ్రీకాకుళం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం జి.సిగడాం మండలం గెడ్డకంచరాంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక ర్తల కష్టాన్ని అధిష్ఠానం గుర్తిస్తుందన్నారు. గ్రామాల్లో కూటమి నాయకులను సమన్వయం చేసుకొని శతశాతం ఫలితాలు సాధించేలా ముం దుకు సాగాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాల న్నారు. అంతకుముందు గ్రామంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సమ స్యలు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతు లను పరిశీలించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవి నాష్‌, నాయకులు కుమరాపు రవికుమార్‌, కుది రెళ్ల బుజ్జి, నక్క మురళీ, బాలబొమ్మ వెంకటే శ్వరరావు, పిన్నింటి భానోజీ నాయుడు, లంక నారాయణరావు, పిసిని జగన్నాథంనాయుడు, బెండు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:56 PM