Share News

పేదరిక నిర్మూలనకు పాటుపడాలి: అశోక్‌

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:07 AM

పేదరిక నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడా లని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. రామయ్యపుట్టుగలో ఇచ్చాపురం నియోజకవర్గస్థాయి పీ-4 కార్యక్రమంపై సోమవారం సదస్సు నిర్వహించారు.

పేదరిక నిర్మూలనకు పాటుపడాలి: అశోక్‌
కవిటి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడా లని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. రామయ్యపుట్టుగలో ఇచ్చాపురం నియోజకవర్గస్థాయి పీ-4 కార్యక్రమంపై సోమవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో కనీస అవస రాలు సరిగా లేని కుటుంబాలు, వ్యక్తులను గుర్తించి వారిని స్థానిక సంస్థలు, పెద్ద లు దత్తత తీసుకోవడమే పీ-4 లక్ష్య మన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 13,700 మందిని గుర్తించి వారిలో 899 మందిని దత్తత తీసుకు నేందుకు సంస్థలు, వ్యక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి, ఏపీసీ పి.వేణుగోపాలరావు, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: గోవిందరావు

పాతపట్నం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): సమాజాభివృద్ధిలో ప్రజలు స్వచ్ఛం దంగా భాగస్వామ్యం కావాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. సోమవారం పాతపట్నంలో పీ-4 వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గదర్శకులైన పోతురాజు శ్రీధర్‌ (హిరమండలం), ఉపాధ్యా యుడు గేదెల వెంకటరమణ (కొత్తూరు), కాగువాడ సర్పంచ్‌ నల్లి జగదీశ్వరరావు (పాతపట్నం)లను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, టీడీపీ మండల నేతలు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు

వినూత్న ఆలోచన పీ-4: ఎన్‌ఈఆర్‌

రణస్థలం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనే పీ-4 అని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు. పీ-4 అమలు చేసి ఏడాది అయిన సందర్భంగా మండల కేంద్రం లోని ఓ కల్యాణ మండపంలో సోమవారం సదస్సు నిర్వహించారు. మార్గదర్శులు బుడుమూరు సూర్యారావు, నడుకుదిటి తేజాబాబు, జోగినాయుడు, ప్రసాద్‌లను ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో నియోజక వర్గం ప్రత్యేకాధికారి పి.సుగుణా కర్‌, కూటమి నాయకులు లంక శ్యామలరావు, డీజీఎం ఆనందరావు, ముప్పిడి సురేష్‌, బెండు మల్లేశ్వరరావు, అన్నెపు భువనేశ్వరరావు, జి.రాము, రౌతు శ్రీనివా సరావు, పిషిని జగన్నాథం నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

‘సంక్షేమం-అభివృద్ధే కూటమి లక్ష్యం’

జి.సిగడాం, మార్చి 30 (ఆంఽధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం చెట్టుపొదిలాంలో ‘నమస్తే ఎచ్చెర్ల- మన ఊరికి మన ఎమ్మెల్యే’ కార్యక్ర మం నిర్వహించి ప్రజల నుం చి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కుమరాపు రవికుమార్‌, పైల విష్ణుమూర్తి, బూరాడ వెంకట రమణ, కుదిరెళ్ల బుజ్జి, బెవర జగన్నాఽథరావు, ఈఈ బోర గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

‘పేదల జీవనోపాధి మెరుగుదలకు చర్యలు’

పలాస, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పీ-4తో పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటోందని ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు తెలిపారు. సోమవారం పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని జీడి వ్యాపారుల సంఘం భవనంలో పీ-4 వార్షికోత్సవం నిర్వ హిం చారు. ఉపాధి, జీవనోపాధి, విద్య, ఆరోగ్యం, నైపుణ్యత, సామాజిక భద్రతకు ప్రభు త్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 3478 బంగారు కుటుంబాలకు మద్దతు అందిం చినట్లు చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు, తహసీల్దార్‌ టి.కల్యాణ చక్రవర్తి, ఎంపీడీవో వసంతరావు, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 12:07 AM