స్వచ్ఛాంధ్రలోభాగస్వామ్యంకావాలి: ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:44 PM
పరిశుభ్రతతోనే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
అరసవల్లి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రతతోనే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని దండివీఽధి దోబీఘాట్ చెరువు వద్ద శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు వద్ద పేరుకుపోయిన చెత, చెదా రాన్ని తొలగించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు, స్థానిక నాయకుడు విభూది సూరిబాబు, ప్రజలు పాల్గొన్నారు.
పరిశుభ్రతతో ఆరోగ్యం: డీఎంహెచ్‌వో
అరసవల్లి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): అందరూ పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యం పెంపొందించు కోవచ్చని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.కె.అనిత అన్నారు. ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’, జలం-జీవం కార్యక్రమంలో భాగంగా శనివారం వైద్యారోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ప్రతీ ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి కుంటలను, చెరు వులను, బావులను సంరక్షించి శుభ్రగా ఉంచాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవా లన్నారు. కార్యక్రమంలో డా.వెంకటరావు, డెమో కె.ఎర్రన్న, డిప్యూటీ హెచ్‌ఈవో పి.మోహిని, రత్నకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: ఆర్డీవో
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరి శుభ్రత అందరి బాధ్యత అని టెక్కలి ఆర్డీవో, ప్రత్యేకా ధికారి ఎం.కృష్ణమూర్తి అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ఽఽశనివారం జలధార-జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 15వ వార్డు బందరోడ్ చెరువు ఆవరణలో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు, చెత్త చెదారాలను తొల గించారు. జామి ఎల్లమ్మ గుడి ఎదురుగా మొక్కలు నాటి, స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కమిుషనర్ ఎన్.రమేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర, మున్సిపల్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి: డీడీ
లావేరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను పెంపొందేలా పనులు చేపట్టాలని జిల్లా భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్‌వీకే దుర్గా ప్రసాద్ అన్నారు. శనివారం తాళ్లవలసలో భూ గర్భజలాలు పెంపొం దించే కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంపొందించేందుకు జలధార, జలహారతి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛం ధ్రపై ర్యాలీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత సురేష్, మాజీ సర్పంచ్ ముప్పిడి మురళీ మోహన్, ఎంపీడీవో పి.వెంకట రాజు, భూగర్భ జలశాఖ అధికారులు డి.రమేష్, ఆర్.అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.