Share News

క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎన్‌ఈఆర్‌

ABN , Publish Date - Jun 03 , 2026 | 11:55 PM

యువత క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ముందుకు సాగాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. యువనేత నడుకుదిటి తేజాబాబు ఆధ్వర్యంలో 20 రోజులుగా ఎన్‌ఈఆర్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఏ మోడీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు.

క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎన్‌ఈఆర్‌
విజేత జేఆర్‌పురం జట్టుకు నగదు చెక్‌, ట్రోఫీ అందిస్తున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు

రణస్థలం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): యువత క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ముందుకు సాగాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. యువనేత నడుకుదిటి తేజాబాబు ఆధ్వర్యంలో 20 రోజులుగా ఎన్‌ఈఆర్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఏ మోడీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ పోటీల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని నాలు గు మండలాల నుంచి 72 జట్లు పాల్గొన్నాయి. బుధవారం జేఆర్‌పురం-ముద్డాడ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. నిర్ణీత 10 ఓవర్లలో జే ఆర్‌పురం 109 పరుగులు చేయగా ముద్డాడ జ ట్టు 7 ఓవర్లలో 37 పరుగులకు ఆల్‌ట్‌ అయ్యింది. విజేతగా నిలిచిన జేఆర్‌పురం జట్టుకు రూ.లక్ష నగదు, రన్నర్‌ ముద్దాడ జట్టుకు రూ.50 వేల నగదు పురస్కారం, ట్రోఫీలను ఎమ్మెల్యే ఎన్‌ఈ ఆర్‌ అందజేసి అభినందించారు. తృతీయ బహు మతి సాధించిన చిన్నయ్యపేట జట్టుకు రూ.25 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు స్నేహ సంబంధాలను పెంచుతా యన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు డీజీఎం ఆనందరావు, లంక శ్యామల రావు, ముప్పిడి సురేష్‌, బెండు మల్లేశ్వరరావు, కొమ రాపు రవి, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఉపాధ్య క్షురాలు నడుకుదిటి రజిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 11:55 PM