Share News

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:41 PM

స్వచ్ఛ గ్రామాలుగా తయారుచేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావా లని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

గార, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ గ్రామాలుగా తయారుచేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావా లని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చేపడుతున్న స్వర్ణాం ధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ఆదివారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద గ్రామాల్లో చెత్త సేకరణకు గాను 35 వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు పరి శుభ్రంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గ్రామా ల్లో పారిశుధ్య కార్యక్ర మాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం విజయవం తం అయ్యేందుకు అధికారులు, ప్రజా ప్రతి నిధులు, పంచాయతీ సిబ్బంది, గ్రీన్‌ అంబాసి డర్లు సమష్టిగా కృషి చేయాలన్నారు. పారి శుధ్య కార్మికులు ఇళ్లకు వచ్చినప్పుడు చెత్తను బండ్లకు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సర్పం చ్‌ బడగల అప్పారావు, కళింగ వైశ్య కార్పొ రేషన్‌ డైరెక్టర్‌ పొట్నూరు కృష్ణమూర్తి, ఎంపీ డీవో శ్రీనివాసు లు, తహసీల్దార్‌ చక్రవర్తి, శ్రీకాకుళం మార్కె ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పీస వెంకట రమణ మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:41 PM